ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 టైటిల్ ఇదే, రిలీజ్ డేట్ కూడా ఖరారు!

ntr-biopic-part-2
- Advertisement -

హైదరాబాద్: దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. గురువారం ఉదయం నుంచి చిత్ర యూనిట్ అభిమానులని ఆశ్చర్యపరుస్తూ ఈ చిత్రానికి సంబంధించి సంచలన ప్రకటనలు చేస్తోంది.

- Advertisement -

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నాడు. ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తొలుత ఒకే సినిమాగా తెరకెక్కుతోందని అందరూ భావించారు. కానీ ఎన్టీఆర్ జీవితంలో అద్భుతమైన మజిలీలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిని రెండున్నర గంటల్లో చూపించడం సాధ్యం కాదని భావించిన ఈ చిత్ర దర్శకుడు క్రిష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. తొలి భాగం టైటిల్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’గా గురువారం ఉదయమే దర్శకుడు క్రిష్ ప్రకటించారు. తొలి భాగంలో ఎన్టీఆర్ నటజీవితానికి సంబందించిన అంశాలన్నీ చూపించనున్నారు.

పార్ట్ 2 టైటిల్ ఇదే…

ఇక ఈ చిత్రం రెండో భాగం టైటిల్‌ను ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా ఖరారు చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్, రానా ట్విటర్‌లో ప్రకటించారు. ‘‘ఆయన కథగా మారితే కథానాయకుడు.. ఆయనే చరిత్ర అయితే మహా నాయకుడు..’’ అంటూ రానా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వైనాన్నిఈ రెండవ భాగంలో చూపించనున్నారు.

విడుదల తేదీలూ ఫిక్స్…

ఈ రెండు భాగాలకు సంబందించిన షూటింగ్ ఒకేసారి పూర్తి కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9, 2019న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కానుంది. ఆ తర్వాత కొద్దిరోజుల గ్యాప్‌లోనే సెకండ్ పార్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ జనవరి 24, 2019 న విడుదల చేయనున్నారు.

- Advertisement -