‘ధోనీ’ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు అదే కారణమా..?

- Advertisement -

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్‌ ధోనీ చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. 

ఈ చిత్రానికిగానూ అతడికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం కూడా లభించింది.

ఈ చిత్రం కంటే ముందే సుశాంత్ అనేక సినిమాల్లో నటించి అనేక అవార్డులను కూడా దక్కించుకున్నాడు.

అయితే అలాంటి యువ నటుడు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం సినీలోకాన్ని, ముఖ్యంగా బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది.

అయితే సుశాంత్‌ సింగ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత 6 నెలలుగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

సుశాంత్‌ సన్నిహితులు కూడా అతను తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు వెల్లడిస్తున్నారు. కాగా  శనివారం రాత్రి తన బెష్ట్ ఫ్రెండ్స్ ని కలిసిన సుశాంత్..వారితో ఎటువంటి విషయాలు పంచుకోలేదు.

మధ్యాహ్నాం వరకు కూడా సుశాంత్ బయటికి రాకపోవడంతో పనిమనిషికి డౌట్ వచ్చి వాళ్ల ఫ్రెండ్స్ కి ఫోన్ చేసింది.

దీంతో స్నేహితులు వచ్చి తలుపులు బద్దలు కొట్టడంతో… సుశాంత్ అప్పటికే విగతజీవిగా పడి ఉన్నారు.

కాగా ఆ మధ్య సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సేలియన్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

సుశాంత్ మానసిక వత్తిడికి కారణం ఏమిటి అనేది మాత్రం తెలియడం లేదు. ఆదిశగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సుశాంత్‌కు ఓ గర్ల్‌ ఫ్రెండ్ ఉందని, ఆమె మోసం చేయడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పూకార్లు వినిపిస్తున్నాయి.

దీనిపై అతడి సన్నిహితులు స్పందిస్తూ, ఇవన్నీ అసత్యాలని, సుశాంత్‌ది అంత బలహీన మనస్తత్వం కాదని చెబుతున్నట్లు సమాచారం.

- Advertisement -