కరోనా భయంతో.. డూప్స్‌తో ‘ఆర్‌‌ఆర్‌ఆర్’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం!

- Advertisement -

హైదరాబాద్: జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రం దేశం మొత్తాన్ని మాయలో పడేసింది. ఆ తర్వాత జక్కన్న డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ’ఆర్‌ఆర్‌ఆర్‌’.

‘రౌద్రం రణం రుధిరం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు షూటింగ్‌కు అనుమతులు లభించినా.. హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా

- Advertisement -

పెరుగుతుండటంతో ఆలోచించి అడుగేయాలని  చిత్రయూనిట్ భావిస్తోంది. అందుకే స్టార్ హీరోలతో కాకుండా వారి డూప్స్‌తో రెండు రోజులు ట్రయల్ షూట్ చేయాలని దర్శకధీరుడు రాజమౌళి భావిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.

హైదరాబాద్ శివార్లలో, లేదంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్‌లో ఈ ట్రయల్ షూట్ చేయనున్నారట. ఈ ట్రయల్ షూట్‌లో మొత్తం 50 మంది పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ షూట్ క్వాలిటీని రివ్యూ చేసిన తర్వాత ఒరిజినల్ షూట్‌పై రాజమౌళి ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇలా చేయడానికి ఇద్దరు స్టార్ హీరోలు, నిర్మాత కూడా ఓకే చెప్పారని అంటున్నారు.

- Advertisement -