కాలేజీ రోజుల్లో.. ప్రేమలో.. నేను మోసపోయా: శిల్పా‌శెట్టి

- Advertisement -

shilpa-shetty

పొడుగు కాళ్ళ శిల్పా సుందరి శిల్సా శెట్టి తన ప్రేమ వ్యవహారాల గురించి ఒకసారి  బయట పెట్టింది. ‘హియర్ మి’, ‘లవ్ మి’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న శిల్పశెట్టి   ఆ సంగతి ఓ ఇంటర్వ్యలో భాగంగా ఈ షొ గురించి మాట్లడుతూ… ఇలాంటి షోలతో ఆడియన్సన్ మంచి వినోదాన్ని పోందుతారని శిల్పా శెట్టి తెలిపింది. తన టీనేట్‌లో ఓ అబ్బాయితో ప్రేమలో పడ్డవిషయాన్ని శిల్పాశెట్టి నెమరు  వేసుకుంది..

- Advertisement -

కాలేజీ రోజుల్లో…

నా కాలేజీ  రోజుల్లో ఈ సంఘటన జరిగింది. నాతోపాటు చదువుకునే ఓ అబ్బాయి ప్రతి రోజు సాయంత్రం మా ఇంటికి ఫోన్ చేసేవాడు. నేను కూడా అతడితో
మాట్లాడేదాన్ని. నన్నుఅతడు ప్రేమిస్తున్నాడని అనుకున్నా. మా నాన్న ఇంట్లో ఉన్న సమయంలో  అతడి ఫోన్ కట్ చేసేదాన్ని అని శిల్పాశెట్టి తెలిపింది.

బస్‌‌స్టాప్‌కు వెళ్ళి…

కలుసుకోవడానికి ఒక రోజు బస్ స్టాప్‌కు నన్ను రమ్మని పిలిచాడు. నేను అక్కడికి వెళ్ళి  అతడి కోసం చాలా సమయం ఎదురు చూశా. కానీ అతడు మాత్రం రాలేదు. నేను మోసపోయాననే సంగతి మా ప్రెండ్స్ ద్వారా తెలిసిందని శిల్పా శెట్టి తెలిపింది.

ప్రేమ పందెం…
అతడి గురించి మా ప్రెండ్స్ చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాను. ప్రెండ్స్‌తో కట్టిన పందెం వలనే నన్ను ప్రేమిస్తున్నట్లు నటించాడు. ఆ సంఘటనతో చాలా బాధపడ్డా. వినడానికి కథలా అనిపించినా ఇది నిజం అని శిల్నాశెట్టి తెలిపింది.

మళ్ళీ బాలీవుడ్ చిత్రాల్లో…

శిల్పశెట్టి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే, తాను తిరిగి బాలీవుడ్ చిత్రాల్లో నటించాలనే కోరికని బయట పెట్టింది శిల్పా‌శెట్టి . వయసుకు
తగ్గ పాత్రలు చేయడానికే మొగ్గు చూపుతానని, లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించాలని ఉందని శిల్పా శెట్టి చెప్పింది.

- Advertisement -