బిగ్‌బాస్-3: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి

7:22 am, Mon, 16 September 19
shilpa-chakravarhty

హైదరాబాద్: వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన యాంకర్, నటి శిల్ప చక్రవర్తి ఆదివారం ఎలిమినేట్ అయింది. తొలి వారం ఎలిమినేషన్ నుంచి మినహాయింపు దక్కినప్పటికీ రెండో వారం తప్పించుకోలేకపోయింది.

నిజానికి శిల్ప రాకతో షో మరింత ఆసక్తిగా మారుతుందని అందరూ భావించారు. అయితే, ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. ఈ వారం శిల్పతోపాటు శ్రీముఖి, హిమజ, పునర్నవి, మహేశ్ విట్టాలు నామినేట్ అయ్యారు.

వీరిలో అతి తక్కువ ఓట్లు దక్కించుకున్న శిల్ప ఎలిమినేట్ కాక తప్పలేదు. కాగా, ఇప్పటి వరకు షో నుంచి ఎలిమినేట్ అయినవారందరూ తొలిసారి నామినేట్ అయిన వారే కావడం గమనార్హం.

గతంలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి కూడా హౌస్‌లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది.