యాంకర్ శ్రీముఖికి అవార్డు.. ‘మోస్ట్ డిజైరబుల్ ఉమన్ ఆన్ టెలివిజన్’గా…

6:02 pm, Fri, 31 January 20
anchor-srimukhi-most-desirable-woman-on-tv-2019

హైదరాబాద్: అందంగా, చలాకీగా ఉండి.. తన మాటల గారడీతో ప్రేక్షకులను టీవీకి అతుక్కుపోయేలా చేస్తుంది. టీవీ ఉన్న ప్రతి ఇంట్లో తనకంటూ ఒక అభిమానిని సంపాదించుకుంది. స్టూడెంట్స్ అందరూ ఆమెను అక్కా అక్కా అని పిలుస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2.5 మిలియన్లకుపైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. 

మేం ఎవరి గురించి ఇదంతా చెబుతున్నామో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అవును, ఆమె మీరనుకుంటోన్న యాంకర్ శ్రీముఖి. శ్రీముఖికి ‘పటాస్’ షో విద్యార్థులలో ఎనలేని క్రేజ్‌ తెచ్చిపెట్టింది. తెలుగు ‘బిగ్‌బాస్ సీజన్-3’లో రన్నర్ అప్‌గా నిలిచి.. తన సత్తా ఏంటో నిరూపించుకున్న శ్రీముఖి అప్పుడప్పుడు విభిన్న పాత్రల్లో వెండితెర ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది.

చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ న్యూ అప్డేట్: అజయ్ దేవగణ్ వచ్చేశాడు.. ఆహ్వానం పలికిన ఎన్టీఆర్

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, తాజాగా.. శ్రీముఖి ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ’ అవార్డును గెలుచుకుంది. హైదరాబాద్ టైమ్స్ ప్రతి సంవత్సరం ఈ అవార్డు కోసం ఓటింగ్ పోల్‌ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది నిర్వహించిన ఈ పోల్‌లో శ్రీముఖి నంబర్ వన్‌గా నిలిచింది.

టాప్ 15 మందిలో ఎవరెవరు ఉన్నారంటే…

హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన ఈ పోల్‌లో టాప్ 15 మందిని ఎంపిక చేశారు. శ్రీముఖి మొదటి స్థానంలో నిలవగా.. ప్రో కబడ్డీ లీగ్‌కు తెలుగులో వ్యాఖ్యాతగా వ్యవహరించిన వింద్య విశాఖ రెండో స్థానంలో నిలిచింది.

ఇక ఈ మధ్యే బుల్లితెరపై కనిపిస్తున్న వర్షిణి నాలుగో స్థానంలో నిలవగా.. యాంకర్ రష్మి మాత్రం అయిదో స్థానంలో ఉంది.  ఆరో స్థానాన్ని విష్ణుప్రియ సొంతం చేసుకుంది. ‘రంగమ్మత్త’ అనసూయ మాత్రం 14వ స్థానంలో ఉంది.

గత ఏడాది 11వ స్థానం, ఇప్పుడేమో నంబర్ వన్…

గత ఏడాది కూడా హైదరాబాద్ టైమ్స్ ఈ అవార్డు కోసం ఓటింగ్ పోల్‌ నిర్వహించగా శ్రీముఖి 11వ స్థానంలో నిలిచింది. కానీ ఏడాది తిరిగేసరికి  నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుని ఏకంగా అవార్డునే కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఓటింగ్ పోల్‌లో ఎంతోమంది సీనియర్ యాంకర్లను కాదని ప్రేక్షకలు శ్రీముఖికి ఓటు వేసి పట్టం కట్టారు. 

చదవండి: ‘అర్జున్‌రెడ్డి’ నయా మూవీ షురూ! శ్రీదేవి కూతురి స్థానంలో మరో నటి?

ఈ అవార్డు గెలుచుకోవడంపై శ్రీముఖి కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు ఈ అవార్డు వచ్చినట్లు తెలియగానే అసలు నమ్మలేకపోయానని, తనను ఈ అవార్డుకు నామినేట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది.

‘‘నేను ఈ అవార్డు గెలుచుకోవడానికి ‘బిగ్‌బాస్ సీజన్-3’ నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఆ షోలో ప్రేక్షకులు నన్ను నన్నుగా చూశారు. నేను బయటి ప్రపంచంలో ఎలా ఉంటానో, ఎలా తింటానో, ఎలా వండుతానో, ఎలా ఫైట్ చేస్తానో.. అన్నీ ప్రేక్షకులు గమనించారు. అవే నాకు ఈ అవార్డు రావడానికి కూడా ఉపయోగపడ్డాయని అనుకుంటున్నా..’’ అని తెలిపింది.

‘‘సెక్సీ అని ఎప్పుడు పిలిపించుకుంటారు?’’

అవార్డు వచ్చిన సందర్భంగా..  ‘‘చాలా మంది మిమ్మల్ని క్యూట్, ట్రెడిషినల్ గర్ల్ అంటుంటారు కదా మరి మిమ్మల్ని సెక్సీ అని ఎప్పుడు పిలిపించుకుంటారు?’’ అని ప్రశ్నిస్తే.. ‘‘మీరు నాకో చిన్న స్కర్ట్ ఇచ్చి వేసుకోమన్నా కూడా వేసుకుంటాను. కానీ, నా అభిమానులు, కాలేజీ విద్యార్థులు నన్ను ఎక్కువగా చూడీదార్, లంగా ఓణీలో చూడటానికి మాత్రమే ఇష్టపడతారు..’’ అని శ్రీముఖి బదులిచ్చింది. 

చదవండి: తప్పుడు కేసు, అక్రమ అరెస్టుకి ఫలితం.. ఎస్సైకి నెల రోజులు జైలుశిక్ష!

అంతేకాకుండా, బాలీవుడ్ నటి విద్యా బాలన్‌ని ఉదహరిస్తూ.. ‘విద్య ఎక్కువగా చీరలలోనే కనిపిస్తారు. మరి ఆమె మోస్ట్ సెక్సీయెస్ట్ ఉమెన్ ఇన్ ఇండస్ట్రీ కాలేదా?’’ అని ఎదురు ప్రశ్నించింది కూడా.

మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరంటే..  సౌందర్య, విద్యా బాలన్, మహానటి సావిత్రి అని చెప్పింది. ఈ సందర్భంగా తన మనసులోని కోరికను కూడా వెల్లడించింది. అదేమిటంటే… ఎప్పటికైనా జీరో సైజులో తనను చూసుకోవాలని ఉందట.  అలాగే తనకు హైపర్ యాక్టివ్‌గా ఉండే వాళ్లంటేనే ఇష్టమని చెబుతూ.. తనకు రణ్‌వీర్ సింగ్‌లా ఉండేవాళ్లు నచ్చుతారని పేర్కొంది శ్రీముఖి.