బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీముఖి…ఏమిటో చూడండి?

10:07 am, Sat, 18 May 19
Sree Mukhi Latest news, Telugu Anchor news, Patas Show News, Newsxpressonline

హైదరాబాద్: తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలం పాటు యాంకర్లుగా నిలదొక్కుకున్నది చాలా తక్కువ మందే. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుమ గురించి. ఆమె తరవాత జబర్దస్త్ షోతో అనసూయ, రష్మి బాగా పాపులర్ అయ్యారు. ఇక, నటిగా ప్రయాణం ప్రారంభించి యాంకర్‌గా మారిన బొద్దుగుమ్మ శ్రీముఖి పటాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించారు.

పటాస్ అంటే శ్రీముఖి, రవి అని ఆ షో చూసేవాళ్లు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయారు. అయితే, ప్రస్తుతం ప్రసారమవుతోన్న పటాస్ 2 షోలో లేడీ యాంకర్ మారుతున్నారు. శ్రీముఖి స్థానంలో కొత్త యాంకర్ రాబోతున్నారు. శ్రీముఖి అభిమానులకు ఇది మింగుడుపడని వార్తే , అయినప్పటికీ ఇదే నిజం. ఈ మేరకు శ్రీముఖి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇకపోతే అసలు విషయానికొస్తే …శ్రీముఖి ఇలా హఠాత్తుగా పటాస్ నుండి బ్రేక్ తీసుకోవడానికి కారణమేమై ఉంటుందా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం శ్రీముఖికి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెకు బిగ్ బాస్ 3 సీజన్‌లో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

ఆ షోలో పాల్గొనడం కోసమే శ్రీముఖి బ్రేక్ తీసుకుందనేది సమాచారం. ఇప్పటికే రెండు సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ షో, త్వరలో తన మూడవ సీజన్‌‌తో తెలుగువారిని అలరించడానికి సిద్దమవుతోంది. ఈ ప్రస్తుత సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయనున్నారు అని సమాచారం.

దీనిపై త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేయనున్నారు. ఈ తాజా బిగ్ బాస్ సీజన్ 3 జూలై రెండవ వారంలో ప్రారంభం కానుంది. చూడాలి మరి ఈ హాట్ యాంకర్ బిగ్ బాస్ లో ఏ విధంగా ఆకట్టుకుంటుందో…

చదవండి: రాళ్లపల్లి మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, జగన్, చిరంజీవి..