బిగ్‌బాస్ హోస్ట్‌గా కింగ్ నాగార్జున

1:11 pm, Tue, 19 March 19
King Nagarjuna as Big Host News, Bigg Boss 3 Latest News, Newsxpressonline

హైదరాబాద్: బిగ్ బాస్ 3’కి సంబంధించిన సన్నాహాలను ‘స్టార్ మా’వారు మొదలుపెట్టేసినట్టుగా తెలుస్తోంది. ‘బిగ్ బాస్ 1’ను హోస్ట్ గా ఎన్టీఆర్ రక్తి కట్టించారు. దాంతో ఎక్కువ మొత్తం పారితోషికాన్ని ఆఫర్ చేసి, ‘బిగ్ బాస్ 3’కి కూడా ఆయననే తీసుకోవడానికి నిర్వాహకులు ప్రయత్నించారు.

అయితే రాజమౌళి సినిమా కోసం వరుసగా డేట్స్ ఇచ్చేసిన కారణంగా ఎన్టీఆర్ ఈ ఆఫర్ ను తిరస్కరించవలసి వచ్చింది. దాంతో ఈ రియాలిటీ షో నిర్వాహకులు నాగార్జునను సంప్రదించినట్టుగా సమాచారం. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమాన్ని నాగార్జున తనదైన స్టైల్లో సమర్ధవంతంగా నడిపించారు.

ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యారు. అందువలన ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ గా ఆయనని మెప్పించడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం నాగ్ రెండు సినిమాలు చేస్తున్నా .. అవి ఆయన సొంత బ్యానర్లోవే కావడం వలన, డేట్స్ సమస్య ఉండదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.