ఎన్టీఆర్ టైటిల్‌తో సూపర్‌స్టార్! మహేష్ “సరి లేరునీకెవ్వరు”!

5:08 pm, Sat, 27 April 19
Mahesh-Babu

హైదరాబాద్: మే నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న ప్రిన్స్ మహేష్ బాబు మహర్షి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇది మహేష్ బాబు 25 వ చిత్రం కావడం తో మరింత హైప్ క్రేయేట్ అయింది. ఈ మూవీ సక్సెస్ మీట్ ను విజయవాడ లో భారీగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రం తరువాత మహేష్ బాబు తన 26 వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటిస్తున్నారు.
ఈ సినిమా కు స్క్రిప్ట్ సిద్ధంగా గా వుందని తెలుస్తోంది. దీని టైటిల్ పై ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడ్తోంది. సీనియర్ ఎన్ టి ఆర్ నటించిన కంచుకోట సినిమాలోని ఎవర్ గ్రీన్ పాట లోని పల్లవి ‘ సరి లేరునీకెవ్వరు’ అనేదే ఈ సినిమా కథకు ఈ టైటిల్ కు సరిగ్గా సరిపోతుందని అనిల్ రావిపూడి భావిస్తున్నట్లుసమాచారం.

ఈ సినిమాలో మహేష్ పేరు అజయ్ జోసెఫ్ అని కూడా తెలుస్తోంది. ఈ చిత్రం లో మరో ముఖ్య పాత్రలో జగపతి బాబు నటించనున్నారని చెపుతున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం లో విజయశాంతి ఒక కీలక పాత్ర లో కనిపిస్తారని చెపుతన్నారు .మహర్షి సినిమా విడుదల తరువాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.

ఈ సినిమాలో రష్మిక మండన, అదితి హైదరి మహేష్ బాబు సరసన చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. ఈ చిత్రం 2020 లో విడుదల అవుతుందని సమాచారం .ఈ సినిమా గురించి పూర్తి వివరాలు అధికారకంగా ప్రకటించాల్సిఉంది.