‘బిగ్‌బాస్’ సీజన్ 3 హోస్ట్‌గా ఎన్టీఆర్? కండీషన్స్ అప్లై! మరి రాజమౌళి ఒప్పుకుంటాడా?

5:28 pm, Tue, 5 February 19
ntr hosting at biggboss sijan 3

ntr hosting at biggboss sijan 3

హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు బుల్లితెరపై సంచలనాలను నమోదు చేసిన బిగెస్ట్ రియాలిటీ షో. ఈ షో మన తెలుగులో రావడానికి ముందే ఇతర భాషలలో ప్రసారమై ప్రజాధారణ పొందింది. ఈ నేపథ్యంలో ఈ బిగెస్ట్ రియాలిటీ షోని తెలుగులోని ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేయడానికి ఒప్పదం కుదుర్చుకుంది. దీంతో తెలుగులో కూడా బిగ్‌బాస్ టెలికాస్ట్ అవడానికి మార్గం సుగమం అయ్యింది.

ఆ తరువాత బిగ్‌బాస్ సీజన్ వన్ కి టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. కేవలం సినిమాలలోనే కాదు, బిగ్‌బాస్ లాంటి రియాలిటీ షోలలో కూడా తనదైన నటనతో హోస్ట్ అన్నపదానికే వన్నె తెచ్చాడు ఎన్టీఆర్. ఆలా ఎన్టీఆర్ చేసిన మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకుంది.

సీజన్ 2కి వచ్చేసరికి… 

ఆ తరువాత సెకండ్ సీజన్‌కి కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ హోస్ట్‌గా చేయలేకపోయాడు. దీంతో బిగ్ బాస్-2 కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. అయితే ఎన్టీఆర్ రేంజ్‌లో అందరినీ ఆకట్టుకోలేక, ఒకానొక సందర్భంలో విమర్శల పాలయ్యాడు కూడా.

సీజన్ 3కి తారక్ ఒప్పుకుంటారా? 

దీంతో తాజాగా బిగ్‌బాస్ సీజన్ 3కి మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈసారి తారక్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడానికి ఒప్పకొంటారా? అనే ప్రశ్న రేకెత్తుతున్న నేపథ్యంలో పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న RRR మూవీలో ఎన్టీఆర్ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ కనిపించబోతున్నాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుచేత బిగ్‌బాస్‌‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తే గెటప్ బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి తారక్ హోస్ట్‌గా వెళ్లడానికి రాజమౌళి ఒప్పుకొంటారా? అనేది మరో ప్రశ్న.

గత సీజన్‌లో సోషల్ మీడియాపై కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కంటెస్టెంట్‌ల ఎంపిక, ఓట్ల గణన తదితర అంశాలపై చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో బిగ్‌బాస్‌పై ఉన్న క్రేజ్ కొంత మసకబారినట్టు కనిపించింది.

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌కు ఎన్టీఆర్ కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితులలో కూడా షోకి సంబందించిన వివరాలు బయటకి పొక్క కుండా చూడాలి అనేది తారక్ ప్రధాన షరతుగా తెలుస్తోంది.