వైరల్‌గా మారిన బిగ్‌బాస్ బ్యూటీ నగ్న ఫోటోలు!

10:23 am, Wed, 10 April 19
sofiya hayat

హైదరాబాద్: బిగ్ బాస్ ఫేం సోఫియా హయత్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె తన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అందరికీ షాకిచ్చింది. తరచూ తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసే ఈ భామ.. అవి సరిపోలేదని అనుకుందో ఏమోగానీ ఈసారి ఏకంగా నగ్నంగా ఫోటోషూట్‌లో పాల్గొంది.

పైగా ఆ ఫోటోలను తనే స్వయంగా షేర్ చేయడంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. పబ్లిసిటీ కోసం మరీ ఇంతగా దిగజారాలా? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే నెటిజెన్ల ఈ కామెంట్స్ చూసిన సోఫియా అదే స్థాయిలో రెచ్చిపోయింది. ‘‘సమాజం గురించి ఆలోచించేవారు ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయరు.. నా నగ్నదేహాన్ని చూడడం అనేది మీ ఆలోచనలు, మీలోని కోరికలకు అద్దం పడుతోంది..’’ అంటూ కౌంటర్ ఇచ్చింది.

కొందరు మహిళలు కూడా వ్యభిచారిణి అంటూ కామెంట్ చేయడాన్ని బట్టి చూస్తోంటే వారి ఆలోచనల్లోనూ కాముకత్వం ఉందంటూ కామెంట్ చేసింది. తన నగ్న ఫోటోలను షేర్ చేస్తే రేటెంత అని కామెంట్స్ చేస్తున్నారని, ఇలాంటి వాళ్లు సమాజానికి అవసరం లేదని ఫైర్ అయింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం సోఫియా హయత్ నగ్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.