బాహుబలి మూవీలో ‘మనోహరి’ పాటకు.. జెనీలియా స్టెప్పులు.. వీడియో వైరల్

- Advertisement -

మీకు జెనీలియా గుర్తుంది కదా? ‘బాయ్స్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హాసిని పాత్రలో అల్లరి చేస్తూ అందరినీ నవ్వించింది కూడా. అరె, అలా ఎలా మర్చిపోతాం బాసూ అంటారా? ఓకే.

బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో వివాహం తర్వాత ఈ బ్యూటీ సినిమాల నుంచి విరామం తీసుకుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చురుకుగానే ఉంటోంది.

- Advertisement -

కరోనా లాక్‌డౌన్ మొదలైన దగ్గర్నించి షూటింగులు బంద్ కావడంతో సెలబ్రిటీలు అందరూ తమ అభిమానులు, ఫాలోవర్లకు బోరు కొట్టకుండా వినోదాన్ని అందించేందుకు ఏదో రకంగా ప్రయత్నిస్తున్నారు.  

జెనీలియా కూడా భర్త రితేష్‌తో కలిసి తన ఫాలోవర్లతో అప్పుడప్పుడు ఫన్నీ స్టిల్స్‌ను షేర్ చేసుకుంటోంది. అంతేకాదు, తాజాగా ‘బాహుబలి.. ది బిగినింగ్’ చిత్రంలోని ‘మనోహరి’ పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది.

విశాలమైన ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఇసుకలో గాల్లోకి ఎగురుతూ మనోహరి పాటకు స్టెప్పులేయడమే కాక.. ‘సంతోషంగా ఉన్నపుడు డ్యాన్స్ చేయండి..’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది తన డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది జెనీలియా.

దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘మీ వీడియో నా ముఖంలో నవ్వు తెప్పించింది’ అని  కామెంట్ పెట్టాడు. మీరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు అంటూ మరో నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు.

మరి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిన జెనీలియా డ్యాన్స్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

 

 
 
 
 
 

< div style=”padding-top: 8px;”>

View this post on

Instagram

 
 
 
 
 
 
 
 
 

 

When happy …

Dance !!!

A post

shared by Genelia

Deshmukh (@geneliad) on

PDT

 

 

- Advertisement -