‘నోటా’మూవీ ట్విట్టర్ టాక్: ఫస్టాఫ్ ఓకే, కానీ…

nota-movie
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా తమిళ దర్శకుడు, ఎ.ఆర్.మురుగదాస్ శిష్యుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత కె.ఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ద్విభాషా చిత్రం ‘నోటా’ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

- Advertisement -

‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ ఇలా ప్రతి సినిమా పరిశ్రమలోనూ విజయ్ అంటే ఓ ఆసక్తి పెరిగిపోయింది. ఇటీవల విడుదలైన ‘గీత గోవిందం’ సినిమా సైతం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

ఈ నేపథ్యంలో ఈ ‘నోటా’ సినిమాపై ఇప్పటికే తెలుగు, తమిళ రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పడంతో అక్కడ ఈ చిత్రంపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. అక్కడ సినిమా చూసిన తెలుగు, తమిళ ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.

ట్విట్టర్‌లో మిశ్రమ స్పందన…

‘నోటా’ సినిమా ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ మాత్రం అస్సలు బాగాలేదనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. మొత్తం మీద ఇది బిలో యావరేజ్ మూవీ అని తేల్చేస్తున్నారు. తమిళ ప్రజలకు కాస్తో కూస్తో నచ్చినా తెలుగు ప్రజలకు మాత్రం నచ్చదట. అయితే ఫస్టాఫ్‌లో వచ్చే పొలిటికల్ సీన్స్, విజయ్ దేవరకొండ మాస్ పొలిటికల్ ప్రెస్ మీట్ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుందని అంటున్నారు.

ఇదే ఊపు సెకండాఫ్‌లో కొనసాగి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదట. ఆనంద్ శంకర్ సెకండాఫ్‌ను మరీ బోరింగ్‌గా తెరకెక్కించారని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. విజయ్ దేవరకొండ ఎప్పటిలానే తన రౌడీ నటనతో మెప్పించారట. అయితే సత్యరాజ్, విజయ్ మధ్య వచ్చే కొన్ని సీన్లు ‘లీడర్’ సినిమాను గుర్తుచేస్తున్నాయని చెబుతున్నారు.


వివాదంతో మరింత ప్రచారం…

ఇటు తెలుగులోనూ వివాదం చుట్టుముట్టడంతో ప్రచారం బాగా జరిగింది. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడటంతో ‘నోటా’ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశముందని ఈ సినిమా విడుదలపై కొందరు రాజకీయ నేతలు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలను ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను తొలగించాలని పిటిషనర్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -