హీరోయిన్ కీర్తి సురేష్‌కు.. మరో హీరోయిన్ రష్మిక మందన్న ప్రశంసలు…

rashmika-applauds-keerthy-suresh-over-penguin-movie
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ కీర్తి సురేష్‌పై మరో హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ప్రశంసల వర్షం కురిపించింది. కీర్తి సురేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెంగ్విన్’ ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

గత రాత్రి ఈ చిత్రాన్ని వీక్షించిన రష్మిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెడుతూ.. ”కీర్తి నీ నటన మర్చిపోలేక పోతున్నాను ఎప్పటిలాగే ఈ చిత్రంలోనూ నీవు అద్భుతంగా నటించావు..’’ అని పేర్కొంది.

- Advertisement -
చదవండి: మరీ ఇంత నీఛమా? నిన్ను చూస్తే జాలేస్తోంది..: ఆర్జీవీ ‘మర్డర్’ చిత్రం‌పై అమృత స్పందన

అంతేకాదు, ‘‘ఆపదల నుంచి కుటుంబాన్ని పెంపుడు శునకం సైరస్ రక్షించడం చాలా బాగుంది. ఈ సినిమా మాతృ మూర్తులందరికీ సంబంధించినదని కచ్చితంగా చెప్పగలను. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్, కార్తీక్ సుబ్బరాజుతోపాటు ఇతర చిత్రబృందానికి నా అభినందనలు..” అని రష్మిక పేర్కొంది.

పెంగ్విన్ చిత్రంలో సైరస్ పాత్రలో ఓ శునకం నటించిన విషయంతెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ను అది అన్ని విధాలుగా రక్షిస్తూ ఉంటుంది.

ఈ శునకం గురించి దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

‘‘ఈ శునకం అసలు పేరు మ్యాడీ. అది నా పెంపుడు శునకం. నాకు దాని గురించి బాగా తెలుసు. దాని ప్రతి కదలికను పూర్తిగా అర్థం చేసుకోగలను..’’ అని చెప్పారు.

అంతేకాదు, ‘‘ ఈ సినిమాలో సైరస్ పాత్ర కోసం నేను తొలుత శిక్షణ పొందిన శునకం కోసం చాలా వెతికాను, కానీ దొరకలేదు. చిత్రం షూటింగ్‌కు ముందు మా మ్యాడీని సెట్‌కి తీసుకువెళ్లి కొన్ని సీన్స్ చేయించాను. అవి చూశాక అద్భుతం అనిపించింది. అందుకే ఈ చిత్రంలో సైరస్ పాత్రకు మ్యాడీని ఎంచుకున్నాను. అది సహజంగా నటించింది కూడా..’’ అని ఈశ్వర్ వివరించారు.

 

- Advertisement -