కరెంట్ బిల్లు చూసి షాక్ అయిన హీరోయిన్! ఎంతొచ్చిందో తెలుసా?

- Advertisement -

ముంబై: తన ఇంటి కరెంటు బిల్లు చూసి షాకైంది నటి కార్తీక నాయర్. తెలుగు, త‌మిళంలో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరొందిన ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌లి కాలంలో సినిమాలతో పెద్దగా అలరించినది లేదు.

అయినప్పటికీ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కి ట‌చ్‌లోనే ఉంటోంది. తాజాగా త‌న ముంబై ఇంటి క‌రెంట్ బిల్లుని షేర్ చేసిన ఈ అమ్మడు.. బిల్లు చూసి షాక్ అయినట్టు పేర్కొంది.

- Advertisement -

ముంబైలోని కార్తీక‌ ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా బిల్లు తీయకుండా ఇటీవల నేరుగా బిల్లు పంపించారు. ఆ బిల్లు ఏకంగా లక్ష రూపాయలు ఉండటం చూసి కార్తీక షాక్ అయింది‌.

ఇది తన హోటల్ బిల్లు కంటే ఎక్కువగా ఉందని, తన ఇంటికి అంత మొత్తంలో కరెంటు బిల్లు ఎలా వచ్చిందో చెప్పాలని అదానీ గ్రూప్‌ను కార్తీక ప్రశ్నించింది.

చదవండి: దాసరి నారాయణరావు కుటుంబంలో మరో చిచ్చు! కొడుకులిద్దరి నడుమ ఆస్తి తగాదాలు?
 
- Advertisement -