అదేంటోగానీ.. నా పెళ్లి విషయం అందరి కంటే నాకే చివర్లో తెలుస్తోంది: వరలక్ష్మి శరత్‌కుమార్

7:47 pm, Tue, 19 May 20
Varalaxmi Sarathkumar denies rumours on her marriage through her twitter account

చెన్నై: ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అతి తక్కువ మంది హీరోయిన్లలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఫిల్మ్‌ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ హీరోయిన్‌ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

ఇటీవల ఈ హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు గుప్పుమన్నాయి. ఓ క్రికెటర్‌ను ఈ నటి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలపై తాజాగా వరలక్ష్మి స్పందించింది.

చదవండి: మంచి కథ, స్క్రిప్ట్ సిద్ధమైతే.. మళ్లీ ‘పైసా వసూల్’! బాలయ్య-పూరి కాంబినేషన్‌పై ఛార్మి కామెంట్స్…

”ఎందుకో నా పెళ్లి విషయం అందరి కంటే నాకే చివర్లో తెలుస్తోంది..? హా హా హా .. మళ్లీ అవే నాన్సెన్స్‌ రూమర్లు. నా పెళ్లి గురించి ఎందుకో అందరికీ అంత ఆసక్తి.

ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ఆ వార్తను ఇంటి పైకి వెళ్లి గట్టిగా అరిచి చెప్తాను. అప్పుడు కావాలంటే వార్త రాసుకోండి. నేను పెళ్లి చేసుకోవడం లేదు. సినిమాలు వదిలేయడం లేదు..” అని వరలక్ష్మి ట్వీట్ చేసింది.

ఈ మేరకు ఆమె ఓ కోట్‌ను కూడా పోస్ట్ చేసింది. అందులో ”రూమర్ల వలన నా గురించి నాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నా..” అని ఉంది.

వరలక్ష్మి ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’‌లో కీలక పాత్రలో నటిస్తోంది.