విశ్వరూపం 2కు 17 కట్స్ ప్రతిపాదించిన సెన్సార్.. తీవ్ర అసంతృప్తిలో కమల్!

- Advertisement -

కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్రం విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. విశ్వరూపం చిత్రానికి ఇది సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్వరూపం 2 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమిళ వెర్షన్ విశ్వరూపం 2 ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

2013 లో విడుదలైన విశ్వరూపం చిత్రం ఏ స్థాయిలో వివాదాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. చివరకు విడుదలై మంచి విజయం సాధించింది. విశ్వరూపం 2 చిత్రం కూడా ఓ దశలో ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. కానీ కమల్ హాసన్ పట్టుబట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీలైనంత త్వరగా విడుదల చేయాలనేది కమల్ ఆలోచన.

- Advertisement -

అయితే ఈ చిత్రం హిందీ వెర్షన్‌కు మాత్రం సెన్సార్ సభ్యుల నుంచి ఈ చిత్రానికి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు మొత్తం 17 కట్స్ ప్రతిపాదించారట. అందులో కొన్ని కీలకమైన డైలాగ్స్ కూడా ఉండడంతో కమల్ హాసన్ తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

- Advertisement -