సుకుమార్ కంటతడి పెట్టాడట.. ఇంతకన్నాప్రశంస ఇంకేముంటుంది?: వక్కంతం వంశీ

- Advertisement -

వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ ‘నా పేరు సూర్య’ సినిమాను తెరకెక్కించాడు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి వక్కంతం వంశీ స్పందించాడు.

“అమెరికాలో ఈ సినిమాను చూసిన వెంటనే దర్శకుడు సుకుమార్ నాకు ఫోన్ చేశాడు. కొన్ని సన్నివేశాలు వస్తున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యాననీ .. మరికొన్ని సమయాల్లో కంటతడి పెట్టానని చెప్పాడు. సుకుమార్ ఎంత గొప్ప దర్శకుడో మీకు తెలిసిందే. అలాంటి ఓ డైరెక్టర్ అంతగా కథలో లీనం కావడం కన్నా నాకు కావలసినదేవుంటుంది? నాలో రచయిత .. నాలోని దర్శకుడికి మద్దతుగా నిలిచాడు. ఆ దర్శకుడికి మరో దర్శకుడి ప్రశంసలు దక్కాయి. అందుకు నాకు ఎంతో ఆనందంగా వుంది. ఇక సినిమా అనేదే వ్యాపారం కనుక కమర్షియల్ గా ఆలోచించి సాంగ్స్ పెట్టాల్సి వచ్చింది .. అర్థం చేసుకోవాలి ” అంటూ చెప్పుకొచ్చాడు .

- Advertisement -
- Advertisement -