యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే.. 3 లక్షల ట్వీట్లు.. తారక్ భావోద్వేగం…

10:06 pm, Wed, 20 May 20
3 Lakh Tweets on young tiger NTR's Birthday Tarak's Emotion

హైదరాబాద్: ‘ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను.. చివరిదాకా మీకు తోడుగా ఉండడం తప్ప..’ అంటూ టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

బుధవారం ఆయన తన 37వ జన్మదినాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతోపాటు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి: మంచి కథ, స్క్రిప్ట్ సిద్ధమైతే.. మళ్లీ ‘పైసా వసూల్’! బాలయ్య-పూరి కాంబినేషన్‌పై ఛార్మి కామెంట్స్…

మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ తదితరులు ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

బుధవారం దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో #HappyBirthdayTarak అనే ట్యాగ్ ట్రెండ్ అయింది. ఈ ట్యాగ్‌ను ఉపయోగించి 3 లక్షల మందికిపైగా ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా తారక్ కూడా భావోద్వేగంతో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 

‘‘మీరు నా మీద చూపిస్తోన్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను? చివరి దాకా మీకు తోడుగా ఉండడం తప్ప..’’ అంటూ ఆ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

ట్వీట్లన్నీ చదివానని, తన జన్మదినాన్ని ప్రత్యేకం చేశారని పేర్కొంటూ.. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తోటి నటీనటులకు, అభిమానులకు ఎన్టీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.