నాస్తికుడిని అయినా హిందూమతమంటే అందుకే ఇష్టం: నటుడు నాగబాబు

- Advertisement -
హైదరాబాద్: టాలీవుడ్  ప్రముఖ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు హిందూమతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నాస్తికుడిని అయినా కొన్ని మతాలపై తన అభిప్రాయాలు చెప్పదలచుకున్నానంటూ ట్వీట్ చేశారు.
 
తాను హిందూమతాన్ని గౌరవిస్తానని పేర్కొన్న నాగబాబు అందుకు గల కారణాలను కూడా వివరించారు.
 
“ఈశ్వరుడు ఒక్కడే అని నమ్మినా, అనేక దేవతలు ఉన్నారని నమ్మినా, విగ్రహారాధనను నమ్మినా, ఇతర మతాలను నమ్మినా, అసలు దేవుడే లేడని చెప్పే నాస్తికులను సైతం ఎవరినీ నిందించని మతం హిందూమతం.
 
హిందూమతం మనిషిని మనిషిగా బతకమని చెబుతుంది. ఇతర మతాలతో సఖ్యంగా ఉండమని చెబుతుంది. అంతేతప్ప…నీ మతం కానివాడిని చంపెయ్, విగ్రహారాధన చేసేవాళ్లు నరకానికి పోతారు, మా దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడు చెడ్డవాడు అంటూ పిచ్చిమాటలు చెప్పదు… అందుకే హిందూయిజం అంటే నాకు గౌరవం… కానీ నేను నాస్తికుడ్ని”  అని నాగబాబు వివరించారు.
- Advertisement -