మైగాడ్.. కొద్ది నిమిషాల ముందే ఆ హోటల్ ఖాళీ చేశా: సినీనటి రాధిక!

3:33 pm, Sun, 21 April 19
actress-radhika-sarath-kumar-escaped-from-colombo-bomb-blasts

చెన్నై: ప్రముఖ సినీనటి రాధిక బాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు. శ్రీలంకలోని మూడు చర్చిలు, మరో మూడు స్టార్ హోటళ్లలో ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లు చోటుచేసుకున్న ఘటనలో 156 మంది మృతి చెందగా, మరో 300 మందికిపైగా క్షతగాత్రులైన సంగతి తెలిసిందే.

చదవండి: విషాదం: కొలంబోలో బాంబు పేలుళ్లు.. 156 మంది మృతి! ఈస్టర్ రోజునే…

ఈ బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో సినీనటి రాధిక కూడా కొలంబోలోనే ఉన్నారు. ఆమె అక్కడి సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేశారు. అంతేకాదు, పేలుళ్లు జరగడానికి కొద్ది నిమిషాల ముందే ఆమె హోటల్ రూమ్ ఖాళీ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నటి రాధిక తన ట్విట్‌లో వివరించారు.

‘‘ఓ మై గాడ్.. ఈ ఘటనతో నేను చాలా షాక్‌కు గురయ్యాను. ఇలా జరిగిందంటే అసలు నమ్మలేకపోతున్నాను..’’ అంటూ రాధిక బాంబు పేలుళ్ల ఘటనను ఖండించారు.