ఏపీ ‘మూడు రాజధానుల’పై షకీలా పంచ్.. వచ్చేసిన ట్రైలర్

1:29 pm, Mon, 10 February 20

హైదరాబాద్: మలయాళ చిత్రసీమను ఒక ఊపు ఊపిన షకీలా ఆంధ‌్రప్రదేశ్‌ మూడు రాజధానుల ప్రతిపాదనపై సెటైర్ వేశారు. తన కొత్త సినిమా ట్రైలర్‌లో అదిరిపోయే పంచ్‌ ఇచ్చారు.

ఒకప్పుడు శృంగార దేవతగా కుర్రాళ్ల గుండెలను కెలికేసిన షకీలా తాజా సినిమా ట్రైలర్ ఆసక్తి కలిగించేలా ఉంది. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న జగన్‌ ప్రభుత్వ నిర్ణయంపై షకీలా పంచ్ పేల్చింది.

Also Read: హీరోయిన్‌గా నటి సురేఖవాణి కుమార్తె సుప్రీత

షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో షకీలా పేపర్‌ చదువుతుంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులనే వార్తను ఆమె చదివి ‘ఏంటి? మూడు రాజధానులా?’ అని తన అసిస్టెంట్‌ని అడుగుతుంది.

అవును మేడం! జగనన్న మూడు రాజధానులు చేసేశాడు అని అసిస్టెంట్‌ చెప్తాడు. దీంతో ‘పోను పోనూ ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు’ అని షకీలా బదులిస్తుంది.

Also Read: పండుగ సాయన్నగా పవన్.. మరుగునపడిన వీరుడి కథలో జనసేనాని!

ఈ మూవీ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. మూడు రాజధానులపై షకీలా తన సినిమాలో ఎందుకు సెటైర్ వేశారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. షకీలా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. ఏ పార్టీకీ మద్దతివ్వలేదు.

ట్రైలర్ చూసిన తెలుగుదేశం సోషల్ మీడియా ఫాలోవర్స్‌, షకీలాపై, చిత్రం ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. షేర్ల మీద షేర్లు చేస్తూ, వైసీపీ మీద షకీలా సైతం సెటైర్లు వేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.

షకీలా ట్రైలర్‌పై అటు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. టీడీపీ మెప్పు కోసమే, ట్రైలర్‌లో త్రీ క్యాపిటల్స్‌ను షకీలా వ్యతిరేకించారని కౌంటర్ వేస్తున్నారు.

Also Read: పవన్ రీఎంట్రీ సినిమాలో మాజీ భార్య రేణు దేశాయ్?

చివరకు షకీలాను సైతం, మూడు రాజధానుల వివాదంలో టీడీపీ లాగిందని, ఆమెతోనూ విమర్శలు కురిపించే నీచమైన స్థాయికి దిగజారిందని కౌంటర్ వేస్తున్నారు వైసీపీ ఫాలోవర్స్.

మొత్తానికి షకీలా కొత్త సినిమా ట్రైలర్‌లో పంచ్‌లు.. సోషల్ మీడియాలో వైసీసీ, టీడీపీ మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. ఈ సినిమా కథ షకీలానే రాశారని చెబుతున్నారు. అంటే ఈ డైలాగ్‌ కూడా షకీలా అభిప్రాయమే అనుకోవాలి. అంటే, షకీలాకు మూడు రాజధానులు ఇష్టం లేదన్న మాట.

మరి సినిమాలో పొలిటికల్‌ డైలాగ్స్‌ వెయ్యాలంటే, అందులోనూ అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకంగా వివాదాస్పద సన్నివేశాలు పెట్టాలంటే, ధైర్యముండాలి.

ఈ విషయంలో షకీలా పెద్ద సాహసమే చేశారని ప్రేక్షకులంటున్నారు. పొలిటికల్ డైలాగ్స్ పేల్చిన షకీలా, త్వరలో రాజకీయాల్లోకి రావడానికే ఈ డైలాగ్స్ పెట్టారా? ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఆమె ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తిగా మారింది.