హైదరాబాద్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దాదాపు 300 కోట్ల రూపాయలతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది. ఇందులో శ్రియ కూడా నటించబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఇప్పుడా వార్తలపై స్పష్టత వచ్చేసింది. ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టు శ్రియ స్వయంగా బయటపెట్టారు.
అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొన్న శ్రియ.. తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలుగులో రెండు చిత్రాలకు ఓకే చెప్పానని పేర్కొన్నారు. అందులో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటని అన్నారు.
ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లలో అజయ్ దేవగన్ సరసన తాను నటించబోతున్నట్లు శ్రియ వివరించారు.
ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో శ్రియ హీరోయిన్గా నటించారు. దాదాపు 15 ఏళ్ల తరువాత ఆయనతో మళ్లీ పనిచేయబోతున్నారు.
ఆర్ఆర్ఆర్లో అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా కనిపించనున్నారు. వీరితో పాటు సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పలు భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.