అల్లు అర్జున్ పాటకు సిమ్రాన్ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్

2:00 pm, Sat, 16 May 20

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటి సిమ్రాన్ గుర్తుందిగా? అవున్లెండి ఒకప్పుడు వెండితెరపై అందాల కనువిందు చేసిన సిమ్రాన్‌ని ఎలా మర్చిపోతాం అంటారా? అదీ నిజమే!

తాజాగా చెప్పొచ్చేదేమిటంటే.. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

ఈ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ పాటకు సీనియర్ నటి సిమ్రాన్ ఇటీవల మరో కుర్రాడితో కలిసి డ్యాన్స్ చేసింది. అంతేకాదు, ఆ డ్యాన్స్ వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి మరి!

ఈ వయసులో కూడా సిమ్రాన్ చేసిన డ్యాన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. చూస్తుంటే, టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు సిమ్రాన్ రెడీ అవుతున్నట్లు ఉంది.