ఇండస్ట్రీలో ముందు అదే.. ఆ తర్వాతే టాలెంట్: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి తేజస్వి సంచలన వ్యాఖ్యలు…

- Advertisement -

హైదరాబాద్: సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలు కోకొల్లలు. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్.. ఎక్కడైనా సరే! బయటికి తెలిసిన కథలు కొన్నే.. తెలియని వెతలు ఇంకెన్నో.

ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్‌, హీరోయిన్ స్నేహితురాలిగా ప‌లు సినిమాల్లో న‌టించిన తేజ‌స్వి మ‌డివాడ రీసెంట్‌గా బాంబు పేల్చింది. త‌న‌ను కూడా చాలా మంది ‘క‌మిట్‌మెంట్’ అడిగార‌ని ఆమె వెల్లడించింది.

- Advertisement -

అంతేకాదు, సినిమా ఇండస్ట్రీలో అసలు మనుషులను చేరుకోవాలంటే చాలా సమస్యలను దాటి వెళ్లాలి. 90 శాతం కాస్టింగ్ కౌచ్‌ను దాటిన త‌ర్వాతే మ‌న టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే మ‌నుషులుంటారు.. అంటూ కుండబద్దలు కొట్టేసింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలోని చీకటి కోణాలను కూడా తేజస్వి ఆవిష్కరించింది.

‘‘ఇండస్ట్రీలో నా కెరీర్ తొలి రోజుల్లో వారి ప‌డ‌క‌గ‌దికి ర‌మ్మ‌ని న‌న్ను పిలిచిన‌ వారు చాలా మందే ఉన్నారు. ఒకానొక సమయంలో ఎంతో బాధకు గురై.. ఇండ‌స్ట్రీ వ‌ద‌లి వెళ్లిపోవాలని కూడా అనుకున్నా..’’ అంటూ తేజస్వి ఆవేదన వ్యక్తం చేసింది.

నార్త్ నుండి వ‌చ్చే హీరోయిన్లు కూడా ఈ వ్యవహారం గురించి తెలుసని, వారు మాన‌సికంగా స‌న్న‌ద్ధ‌మ‌య్యే వ‌స్తారని పేర్కొంది.  మ‌న ద‌క్షిణాది అమ్మాయిల‌కు కూడా ఈ విష‌యాలు తెలుసునని వ్యాఖ్యానించింది.

‘‘వారు అడిగే ఆ ‘క‌మిట్‌మెంట్’‌కు రెడీగా ఉంటే ఇక్కడ అవకాశాలు చాలానే వస్తాయి.. నేను రిలేష‌న్ షిప్‌లో ఉండి పెళ్లి చేసుకోవాల‌నుకున్న వ్య‌క్తిని కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ కారణంగానే వదిలేసుకున్నా.. ’’ అని పేర్కొంది.

అయితే మ‌నం ఎంత మేర‌కు మెంట‌ల్‌గా ప్రిపేర్ అయ్యున్నామ‌నేదే ముఖ్యం. నేను ఏదైనా ధైర్యంగా మాట్లాడతా.. కాబ‌ట్టి నాతో ఎవ‌రూ ఇలాంటి వ్య‌వ‌హారాల్లో చొర‌వ చూపించ‌డానికి ధైర్యం చేయ‌లేక‌పోయే వారు అని తేజ‌స్వి చెప్పింది.

 

- Advertisement -