లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ మొదలైన తొలి సినిమా.. హీరో హీరోయిన్ కౌగిలింత చూస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

హైదరాబాద్: ‘హీరో ఈ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తాడు. హీరోయిన్ ఆ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తుంది. ఇద్దరూ గట్టిగా కౌగిలించుకుంటారు’.. కానీ ఒకరికొకరు టచ్ మాత్రం అవ్వరు! ఎందుకంటే, ఇద్దరికి మధ్యలో గాజు పలక ఉంటుంది మరి!!

అరె.. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అదంతే. అసలే ‘కరోనా కాలం’. మరి ఆ మాత్రం సోషల్ డిస్టెన్సింగ్ మెయిటెయిన్ చేయొద్దూ..?

- Advertisement -

ఇది టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు ఆలోచన. సినిమాల్లోనే కాదు, ఆయన బిహేవియర్, వర్క్‌లోనూ వైవిధ్యం ఉంటుంది. 

తన సినిమాలకు తాను దర్శకత్వం వహించడమేకాదు.. ఆయనే ప్రధాన పాత్ర కూడా పోషిస్తారన్న సంగతి తెలిసిందే కదా.

గత ఏడాది కూడా డైరెక్టర్ కమ్ యాక్టర్ రవిబాబు ‘అదుగో’, ‘ఆవిరి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 

కరోనా లాక్‌డౌన్ అనంతరం సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించిన వెంటనే ఆయన తన కొత్త చిత్రం ‘క్రష్’ సినిమా షూటింగ్ మొదలెట్టేశారు. 

పైన మీరు చదివిన హీరో హీరోయిన్ కౌగిలింత్ సీన్ ఈ సినిమాలోదే. ఈ వీడియోను ఆయన సెట్‌లో తాజాగా విడుదల చేశారు. 

షూటింగ్‌లకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే షూటింగ్ ప్రారంభమైన తొలి సినిమా తనదేనని చెప్పారు. తమ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశంలోనూ ఇలా భౌతిక దూరం పాటించామని చెప్పారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే ‘సేఫ్’ మరి! హీరో హీరోయిన్ల ఈ సరికొత్త కౌగిలింత దృశ్యంపై మీరూ ఓ లుక్కేయండి మరి!

 

- Advertisement -