ఆర్య భార్యతో.. అఖిల్ రొమాన్స్!? ఫస్ట్ కాంబినేషన్ ఈసారైనా వర్కవుట్ అవుతుందా?

3:00 pm, Thu, 4 July 19
sayesha-saigal-akhil-akkineni

హైదరాబాద్: అక్కినేని అమల, నాగార్జునల తనయుడు అక్కినేని అఖిల్ ఆరంగేట్రం నుంచీ వరుస పరాజయాలు మూటగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అఖిల్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో త్వరలో రూపొందనున్న ఈ చిత్రానికి హీరోయిన్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

చదవండి: ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ రిలీజ్! ఇంత ఎనర్జీని ప్రేక్షకులు తట్టుకోగలరా?

అఖిల్ తాజా చిత్రంలో తొలుత హీరోయిన్‌గా పూజ హెగ్డేనుగానీ లేదంటే కియారా అద్వానీలనుగానీ తీసుకోవాలని భావించారు. అయితే వారు బీజీగా ఉన్నామని, డేట్స్ సర్దలేమని చెప్పేశారు. దీంతో అఖిల్ సరసన నటించేందుకు రష్మిక కోసం గట్టిగానే ట్రై చేశారు చిత్ర నిర్మాతలు.

రష్మిక కూడా హ్యాండ్ ఇచ్చేసరికి…

రష్మిక కోసం పారితోషికం పెంచడానికి కూడా రెడీ అయ్యారు. కానీ అనుకోని కారణాల వలన రష్మిక కూడా ఈ సినిమా చేయలేనని చెప్పేయడంతో ఇక హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే అనే సందిగ్ధంలో పడింది చిత్ర యూనిట్.

అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం ఏమిటంటే.. అఖిల్ తన మొదటి సినిమా ‘అఖిల్’లో తనతోపాటుగా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేసిన సాయేషాతోనే తన తాజా చిత్రంలో నటించాలని భావిస్తున్నాడట. అయితే తమిళంలో వరుస విజయాలు అందుకొని.. ఇటీవల తమిళ హీరో ఆర్యని ప్రేమించి పెళ్లాడిన సాయేషాకి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది.

దీంతో అఖిల్ తాజా చిత్రంలో అతడికి జోడీగా సాయేషాని తీసుకుంటే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. తద్వారా మళ్ళీ ‘అఖిల్’ సినిమా కాంబినేషన్‌ని రిపీట్ చేయాలనీ నిర్మాత, దర్శకుడు.. అందరూ భావిస్తున్నారట. మరి ఈ కాంబినేషన్ ఈసారైనా డిఫరెంట్ రిజల్ట్ ఇస్తుందేమో చూడాలి.

చదవండి: పోలీస్ ఆఫీసర్ పాత్రలో.. పాయల్ రాజ్ పుత్!