కేరళలో ‘అలవైకుంఠపురంలో’ సరికొత్త రికార్డు! అభిమానులా.. మజాకా?

8:09 am, Sun, 12 January 20

తిరువనంతపురం: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో..’ చిత్రం కేరళలో సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి 30 ఫ్యాన్స్ షోస్ (బెనిఫిట్ షోస్) కేరళలో ప్లాన్ చేయడం విశేషం. కేరళలో డబ్బింగ్ సినిమాకు ఇన్ని షోలు వేయడం అరుదైన రికార్డ్‌గా చెబుతున్నారు.

గతంలో ఏ డబ్బింగ్ సినిమాకు లేని విధంగా ‘అల వైకుంఠపురములో..’ సినిమాకు షోస్ వేస్తుండటం అల్లు అర్జున్ అభిమానులు గర్వంగా చెప్పుకునే విషయమే. అల్లు అర్జున్‌ను కేరళలో మల్లు అర్జున్‌గా పిలుస్తారు. ఒక తెలుగు స్టార్‌కు కేరళలో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది.