బన్నీ , త్రివిక్రమ్ సినిమా ఆలస్యానికి గల కారణం ఇదేనా?

12:59 pm, Fri, 29 March 19
Allu-Arjun-HD-Background-

హైదరాబాద్: అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబో సినిమా అనౌన్స్ చేసి దాదాపుగా నాలుగు నెలలు టైం అవుతుంది. కానీ ఇంతవరకు వారి కాంబో పట్టాలెక్కలేదు. అల్లు అర్జున్ మాత్రం మధ్యలో అభిమానులకు చిరాకు రాకుండా సర్దిచెబుతూ వస్తున్నాడు.

తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎప్పుడు అంటూ మెగా ఫాన్స్ తొందరపెడుతుంటే… ఈ సినిమా నిర్మాణ సంస్థ హారిక హాసిని వారు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో జోరుగా పనిచేస్తుంది.. త్వరలోనే సినిమా మొదలవుతుందని అభిమానులను శాంతింపజేశారు. కానీ ఎప్పటినుండి పట్టాలెక్కుతోంది అనేది క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా బన్నీ త్రివిక్రమ్ సినిమా ఇంతగా లేట్ అవడానికి బడ్జెట్ కారణమంటూ ఒక న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి ఎవ‌రు ఎంత పెట్టుబ‌డి పెట్టాల‌నే విష‌యంలో ఇంకా చ‌ర్చ‌లు కొలిక్కి రాలేద‌నేది లేటెస్ట్ టాక్. అలాగే లాభాల్లో కూడా ఎవ‌రు ఎంత వాటా తీసుకోవాలి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయట. మరి త్రివిక్రమ్ ఎప్పుడు తన సొంత బ్యానర్ లాంటి హారిక హాసిని వారి నిర్మాణంలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

పెట్టుబడి లెక్కలు తేలలేదు…

కానీ ఈసారి త్రివిక్రమ్ క్రేజ్ తగ్గడంతో బన్నీది అప్పర్ హ్యాండ్ అవడంతో బన్నీ తన స్వంత నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ని కూడా కలిపాడు. అయితే అల్లు అర్జున్ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టాలి, బన్నీ పారితోషకం ఎంత… అలాగే సీనియర్ ఆర్టిస్ట్ ల పారితోషకాలతో పాటుగా.. హీరోయిన్ రెమ్యునరేషన్, విదేశాల్లో షూట్స్ అన్నీ కలిపి బన్నీ బడ్జెట్ లెక్క పెడితే రూ.70 కోట్లు దాటుతుంది.

కానీ ప్రస్తుతం రూ.50 కోట్ల క్రేజున్న అల్లు అర్జున్ మీద రూ.70 కోట్లు పెట్టుబడి పెడితే వర్కౌట్ అవుతుందా అనే మీమాంసలో హారిక హాసినితో పాటుగా గీత ఆర్ట్స్ వారు ఉన్నారట. అందుకే బడ్జెట్ ఒక కొలిక్కి రాక త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబో లేట్ అవుతూ వస్తుందనేది లేటెస్ట్ టాక్.