అల్లు అర్జున్ సంచలన నిర్ణయం: భారత సైన్యంలో చేరేందుకు దరఖాస్తు!

- Advertisement -
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నట విశ్వరూపం చూపించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నెల 4వ తేదీన విడుదలైన ఈ చిత్రంలో సైనికుడిగా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇండియన్ ఆర్మీని ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రాన్నిఅల్లు అర్జున్ సైనికులతో కలిసి  వీక్షించారు. ఈ చిత్రం గురించి విని సూర్య పాత్ర చేసిన అల్లు అర్జున్‌ని భార‌త సైనిక కుటుంబాలు క‌లిసి గులాబీ పూలతో అభినందించాయి.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… ‘‘నా ఇండియన్స్ అందరికి నమస్కారం. నా పేరు అల్లు అర్జున్ నా ఇల్లు ఇండియా.. ఈ చిత్రాన్ని నిజమైన సైన్యాధికారుల మధ్య, నిజమైన ఆర్మీ క్వార్టర్లలో చిత్రీకరించాం. మా తపనకి సహకారం అందించిన భారత సైన్యానికి నా కృతజ్ఞతలు. ఇప్పటిదాకా చాలా సినిమాలు చేశాను. ఒక సినిమా విజయవంతమైతే పేరొస్తుంది, డబ్బొస్తుంది. వాటిని మించి ఈ సినిమాతో నాకు చాలా గౌరవం లభించింది. నన్ను గర్వపడేలా చేసిన సినిమా ఇదే. చిత్రీకరణ కోసం ఆర్మీ క్వార్టర్లకి వెళ్లినప్పుడే ఆ వాతావరణాన్ని, ఆ జీవితాన్ని చూసి భారత సైన్యంలో చేరాలని దరఖాస్తు చేసుకొన్నా. అధికారులు ఆమోదం తెలపగానే గౌరవ సభ్యుడిగా సైన్యంలో చేరబోతున్నా. నేను మొట్ట మొదట సైన్యాధికారుల్ని కోరింది అదే. నా కెరీర్లో  నేను గర్వపడే సినిమా ఇది. థాంక్స్ టూ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాను ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి థాంక్స్..’’ అని చెప్పాడు.
- Advertisement -