వైల్డ్‌కార్డ్ ఎంట్రీ.. బిగ్‌బాస్ హౌస్‌లోకి నటి శిల్పా చక్రవర్తి.. హౌస్‌మేట్స్ షాక్!

8:10 am, Tue, 3 September 19

హైదరాబాద్: బిగ్‌బాస్ హౌస్‌లోకి మరో పోటీదారు వచ్చేసింది. ప్రముఖ యాంకర్, నటి శిల్పా చక్రవర్తి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గతంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చినా ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేకపోయింది.  

 తాజాగా, శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా సోమవారం నటి ఈషా రెబ్బా వస్తారని ప్రచారం జరిగినా.. అకస్మాత్తుగా శిల్ప ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

బర్త్‌డే వేడుకల కోసం నాగార్జున విదేశాలకు వెళ్లడంతో ఆయన స్థానంలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ వారం వ్యాఖ్యాతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

శిల్ప తల్లిండ్రులది పశ్చిమ బెంగాల్. తల్లిదండ్రులు రైల్వే ఉద్యోగులు కావడంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రైల్వే స్కూల్, కాలేజీలో చదువుకున్నశిల్ప తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది.

అదే ఆమెను యాంకర్‌గా స్థిరపడేలా చేసింది. కల్యాణ్ జడ యాకయ్యను శిల్ప ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.