మగబిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య!

6:45 pm, Sat, 6 April 19
lasya birth to a baby

హైదరాబాద్: బుల్లితెరపై ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న లాస్య తల్లయింది. లాస్య సరిగ్గా ఉగాది నాడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది.

ఫేస్ బుక్ లో పోస్టు

14 గంటల ప్రసవ వేదన అనంతరం బిడ్డను చూసుకున్నానంటూ లాస్య తన పోస్టులో పేర్కొంది. ఈ ఉగాది తమకు ఎంతో ప్రత్యేకమని వెల్లడించింది. యాంకర్ గా కెరీర్ ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడే లాస్య పెళ్లి చేసుకుని యూఎస్ లో సెటిలైంది.

మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లాడిన లాస్య ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అయితే ఇటీవల యూట్యూబ్ లో పలు వీడియోలు రూపొందిస్తూ అభిమానులను అలరిస్తోంది.