రేప్ అనేది ముందే వచ్చిందంటున్న రష్మీ…

9:12 pm, Sat, 4 May 19

హైదరాబాద్: ఎప్పుడూ ఏదో విషయం గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మీ గౌతమ్ తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చూసి కొందరు రష్మీని ప్రశంసిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.

ఇంతకీ ట్వీట్ఏంటి అంటే..

వృత్తి పరంగా యాంకర్, నటి అయిన రష్మీ గౌతమ్ సినిమాల గురించి కంటే ఎక్కువగా సమాజం గురించే మాట్లాడుతుంది. సోషల్ మీడియా వేదికగా సమాజంలో జరుగుతున్న విషయాల గురించి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది..ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు, ఆడవారి హక్కులు మొదలైన వాటిపై ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది.

తాజాగా అలాంటి ట్వీటే ఒకటి చేసింది. ఇటీవల అమ్మాయిలపై జరిగిన రేపులు, మర్డర్లు వంటి అఘాయిత్యాల గురించి మాట్లాడింది.

అమ్మాయిలపై రేప్‌లకు కారణం వారు వేసుకుంటున్న మినీ స్కట్స్ అంటూ కొందరు విమర్శించడం పట్ల రష్మీ ఫైర్ అయ్యింది. “రేప్ అనే పదం ప్యాన్సీ వర్డ్ కాదు.. దాన్ని జోక్‌గా వాడడం ఏంటి” అని విరుచుకు పడింది.

రేప్ చేస్తే అమ్మాయిలని గెలిచినట్టే అనుకునే వారికి “అమ్మాయిలను రేప్ చేసి..గెలిచినట్లు అనుకోవద్దు  వారిని గెలవడానకిి ఎన్నో మార్గాలు ఉన్నాయి.” అంటూ చెప్పింది.

ఆ బాధ రేప్ కి గురైన వారికే తెలుస్తుందని, దానిని మాటల్లో వర్ణించలేం అని చెప్తూ ట్వీట్ చేసింది..

“మినీ స్కట్లు వెయ్యకముందు నుండే రేపులు జరుగుతున్నాయి..” అని ఓ ఫోటో పోస్ట్ చేసింది.

మినీ స్కట్లు వెయ్యడం వల్లే రేపులు జరుగుతున్నాయని చెప్పే వారికి చెంప చెళ్లు మనిపించే సమాధానం చెప్పడంతో కొందరు నెటిజన్లు రష్మీని ప్రశంసిస్తుండగా.. మరి కొందరు విమర్శిస్తున్నారు.

చదవండి:కాజల్ అగర్వాల్ స్టైలిష్ ఫొటోస్