రాజమౌళికి మరో బిగ్ షాక్! ఎన్టీఆర్‌కూ గాయం.. ‘ఆర్ఆర్ఆర్’కు ఈ గండాలేమిటి?

12:19 pm, Wed, 24 April 19
Rajamouli Latest News, RRR Latest News, NTR Latest News, Newsxpressonline

హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరగుతున్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ బయటపడుతుందా…..?

ఇటీవల పూణేలో షూటింగ్ జరుగుతుండగా రామ్‌చరణ్‌ గాయపడటంతో షూటింగ్‌ను అర్థాంతరంగా మూడు వారాల పాటు వాయిదా వేశారు. చరణ్ గాయం తగ్గటంతో ఇటీవల హైదరాబాద్‌లో తిరిగి షూటింగ్ ప్రారంభించారు. అయితే తాజాగా మరో హీరో ఎన్టీఆర్‌ కూడా గాయపడినట్టుగా తెలుస్తోంది.

Rajamouli Latest News, RRR Latest News, NTR Latest News, Newsxpressonline

కుడి చేతికి కట్టుతో ఉన్న ఎన్టీఆర్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే గాయం పెద్దది కాకపోవటంతో ఎన్టీఆర్ యథావిధిగా షూటింగ్‌కు వెళ్తున్నాడట. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్‌‌కు జోడి కోసం చిత్రయూనిట్ అన్వేషణలో ఉంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నాడు.

ఇకపోతే రాజమౌళి సినిమాకి ఇన్ని గండాలు గతంలో ఎప్పుడు ఎదురుకాలేదు. రాజమౌళి అనుకున్నదే తడువుగా అన్ని ఇట్లే జరిగిపోయేవి, కానీ ఒక్క ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలోనే అది రివర్స్‌లో జరుగుతోందని అనుకుంటున్నారు.

అపజయం ఎరుగని డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న రాజమౌళి సినిమాకి ఇలా జరుగుతుండడంతో అందరూ కొంచెం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. సినిమా ఏమైనా తేడా కొడుతుందా అని మెగా అభిమానులు, నందమూరి అభిమానులు సైతం టెన్షన్ పడుతున్నారు.

 

చదవండి:  సచిన్ కి విషెష్ చెప్తూ ఇంటర్ విద్యార్ధులకి హితబోధ చేసిన హీరో రామ్!