మరోసారి విలన్‌గా బాలకృష్ణతో తలపడనున్న జగపతిబాబు

9:48 pm, Mon, 6 May 19

హైదరాబాద్: నవరసాలు పలికించే మాస్ మసాలా సినిమాలు చెయ్యాలంటే బాలయ్యకే సాటి. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్ వంటి చిత్రాలే బాలయ్య నట స్వరూపానికి సాక్ష్యాలు.

ఇలా మాస్ కే కేరాఫ్ గా ఉన్న బాలయ్యని “జై సింహా” చిత్రం ద్వారా ఫ్యామిలీ హీరోగా చూపించి సక్సస్ అయ్యాడు దర్శకుడు కెఎస్.రవికుమార్.

చదవండి: నమ్రత లేకపోతే, మహేష్ అనేవాడు లేడు..!

సి.కల్యాణ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం అటు మాస్ ని ఇటు కుటుంబాన్ని సైతం ఆకట్టుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే మళ్లీ ఈ ముగ్గురు కలిసి ఓ చిత్రం చెయ్యబోతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది..

ప్రస్తుతం నటీనటులను ఎంచుకునే పనిలో ఉన్నారు చిత్రబృందం. ఈ చిత్రంలో బాలయ్యకు ధీటైన ప్రతి నాయకుడు పాత్ర కోసం ఎవరైతే బాగుంటుందని బాగా పరిశోధన చేశారంట. కానీ చివరికి బాలయ్య లెజెండ్ విలన్ జగపతిబాబు అయితేనే కరెక్ట్ అని జగపతిబాబునే ఫైనల్ చేసినట్టు సమాచారం.

కథానాయకుడిగా బాలయ్య ప్రతినాయకుడిగా జగపతిబాబు నటిస్తే ఆ చిత్రం ఎంత రసవత్తరంగా ఉంటుందో మనం లెంజెండ్ లో చూశాం. ఇప్పుడు మళ్లీ హీరో విలన్లు అంటే ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోగలం.. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు మే 17వ తేదీన జరుగనున్నాయి. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. మిగతా పాత్రల విషయాలు త్వరలోనే తెలుస్తాయి.

చదవండి: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బన్నీ సినిమా లేటెస్ట్ అప్డేట్…!