హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈనెల 10న 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది పుట్టిన రోజు బాలయ్యకి ప్రత్యేకం అయినప్పటికీ, కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు.
అభిమానుల ఆరోగ్యం తనకి ముఖ్యమని పేర్కొన్న బాలయ్య అభిమానులు పుట్టిన రోజు వేడుకలు జరపొద్దని సూచించారు.బాలయ్య ఆదేశాల ప్రకారం ఎలాంటి హడావుడి లేకుండానే ఫ్యాన్స్ బర్త్ డే నిర్వహించారు.
అయితే, అంతకుమించి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు ఒకే సమయంలో 21 వేల కేకులను కట్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ హీరో అభిమానులు ఇప్పటివరకు ఇలా చేయకపోవడంతో ఇది ప్రపంచ రికార్డుగా నమోదు అయ్యింది.
గిన్నిస్ బుక్ రికార్డు ప్రతినిధులు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అభిమానులు ఇచ్చిన ఈ అరుదైన బహుమతితో బాలయ్య ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నారు