బాలయ్య రూలర్ సినిమా విడుదలతో జూనియర్ బాలయ్య సందడి

7:17 am, Sat, 21 December 19

బళ్లారి (కర్ణాటక): నగరంలో బాలయ్య అభిమానులు సందడి చేశారు. రూలర్‌ సినిమా విడుదల సందర్భంగా ఓ అభిమాని బాలయ్య వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నాడు. నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్‌’సినిమా శుక్రవారం నగరంలోని నటరాజ్‌ చిత్రమందిరంలో రిలీజైంది.

ఈ నేపథ్యంలో బళ్లారి బాలయ్యగా పేరుతెచ్చుకున్న జూనియర్‌ బాలయ్య బాలకృష్ణ గెటప్‌తో సందడిచేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు రకాల గెటప్స్‌తో నగరంలోని పలు ప్రాంతాల్లో తిరిగి సినిమాలో బాలకృష్ణ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ను కూడళ్లలో నిల్చుని చెప్పాడు.

తన అభిమాన నటుడు బాలకృష్ణ సినిమాలో వేసుకొనే గెటప్స్‌తో ఆయా సినిమాల రిలీజ్‌ రోజున ఇలా అభిమానుల్లో ఉత్సాహాన్ని కల్గిస్తున్నానని, ఇందుకోసం ముంబాయికి చెందిన విలువైన డ్రెస్‌ మెటీరియల్స్‌ను తెప్పించి నట్లు జూనియర్ బాలయ్య తెలిపాడు.