‘ఆహా’ యాప్‌లో ‘భానుమతి అండ్ రామకృష్ణ’

- Advertisement -

హైదరాబాద్: నవీన్ చంద్ర, సలోనీ లూత్రా జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘భానుమతి అండ్ రామకృష్ణ’. ఈ చిత్రం ఇప్పుడు ‘ఆహా యాప్’ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ‘ఆహా యాప్’లో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఉదయం భానుమతి అండ్ రామకృష్ణ చిత్ర యూనిట్ సభ్యులు మంత్రి తలసాని నివాసానికి వెళ్లారు.

- Advertisement -

ఓటీటీ వేదికపై ఈ సినిమాను రిలీజ్ చేసిన అనంతరం తలసాని మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమాలను థియేటర్లలో విడుదల చేయలేని పరిస్థితులు ఉన్నాయని, కరోనా వైరస్ వ్యాప్తితో సినీ పరిశ్రమపై ఆధారపడినవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ‘భానుమతి అండ్ రామకృష్ణ’ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

- Advertisement -