బిగ్‌బాస్-3 కంటెస్టెంట్ అలీ రెజా ఇంట్లో విషాదం.. అలీ భావోద్వేగ పోస్ట్

6:41 am, Thu, 12 September 19

హైదరాబాద్: తెలుగు బిగ్‌బాస్-3 పోటీదారు అలీ రెజా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఆదివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన అలీకి విషాద వార్త తెలిసింది.  ఆయన ఇంట్లో ఉండగానే అతడి మామయ్య మృతి చెందగా, బయటకు వచ్చాక విషయం తెలిసింది.

మామయ్యతో కలిసి తాను దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన అలీ.. తన జీవితంలో విజయాన్ని చూడాలని మామయ్య ఆరాటపడ్డారని, తననిప్పుడు చాలామంది ప్రేమిస్తున్నారని పేర్కొన్నాడు.

అయితే, అది చూసేందుకు ఆయన లేరని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరి క్షణంలో మామయ్యను చూడలేకపోయాననే బాధ తనను వేధిస్తోందన్నాడు. ‘బిగ్‌బాస్’ ఎంత ముఖ్యమో వారికి తెలుసు కాబట్టే తనకు ఆ సమాచారాన్ని ఇవ్వలేదని, కానీ ఆయన కూడా తనకు అంతే ముఖ్యమన్న సంగతి వారికి తెలియదని అన్నాడు.

చివరి ఘడియల్లో మామయ్యను చూడలేకపోయినందుకు బాధపడుతూనే ఉంటానన్న అలీ.. లవ్‌యూ ఫరెవర్ అని పేర్కొన్నాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.