జిమ్‌లో దీపిక లుంగీ డ్యాన్స్.. వీడియో వైరల్

1:22 pm, Mon, 2 March 20

ముంబై: ఫిట్‌నెస్‌ విషయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది ఈ భామ తన టైం టేబుల్‌లో జిమ్‌ వర్కవుట్స్‌ సెషన్‌ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంది.

 

దీపికా తాజాగా జిమ్‌లో రోప్స్‌తో వర్కవుట్స్‌ చేస్తూ లుంగీ డ్యాన్స్‌ పాటకు స్టెప్పులేసింది. దీపికా జిమ్‌ ట్రైనర్‌ యాస్మిన్‌ కరాచీవాలా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

వేకువజామునే 6 గంటలకు కష్టపడేతత్వం, వినోదం సమపాళ్లలో కలిస్తే దీపికా వర్కవుట్‌ సెషన్‌ వీడియో అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది యాస్మిన్‌ కరాచీవాలా. దీపికా, షారుక్‌ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలోని లుంగీ డ్యాన్స్‌ పాట ఏ రేంజ్‌ సూపర్‌ హిట్టయిందో అందరికీ తెలిసిందే.