బాలీవుడ్ సింగర్ కనికకు మూడోసారి కూడా కరోనా పాజిటివ్

5 days ago

లక్నో: బాలీవుడ్ బేబీడాల్ సింగర్ కనిక కపూర్‌కు మూడోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ అనే తేలింది. దీంతో ఆమెను డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు నిరాకరించారు.

ఇటీవల లండన్ వెళ్లొచ్చిన ఆమె మూడు పార్టీల్లో పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ పార్టీలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఆ తర్వాత ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. ఆమె మొత్తంగా 400 మందిని కలిసినట్టు తేలడంతో కలకలం రేగింది.

ఆ తర్వాత సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న కనిక ఆ తర్వాత లక్నోలోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చేరింది.

ఆమెకు ఇప్పటికే నిర్వహించిన రెండు పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్‌గా తేలగా, తాజాగా మూడోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గానే రిపోర్టులు వచ్చాయి.

ఇదే విషయాన్ని వెల్లడించిన వైద్యులు మరో రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తామని, నెగటివ్ రిపోర్టులు వస్తేనే ఆమెను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.

కాగా, కనికతోపాటు హోటల్ తాజ్‌లో ఆమెతో కలిసి బస చేసిన స్నేహితుడు ఓజాస్ దేశాయ్‌కు కరోనా నెగటివ్ అని తేలినట్టు వైద్యులు వివరించారు.