‘ఒంటేరు పాలకోవా.. నడకచూస్తే హంస నావా..’: ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టిన పాయల్!

12:40 pm, Wed, 3 April 19
bulreddy song payal raj put

హైదరాబాద్: తెలుగు ఇండస్ట్రీలో వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కొత్త హీరో కార్తికేయ, వర్ధమాన నటి పాయల్ రాజ్‌పుత్‌లతో తీసిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదట విమర్శలపాలైనా తర్వాత తర్వాత ఆ బోల్డ్ కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్‌కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.

దాంతో ‘ఆర్ఎక్స్ 100’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా బాగానే సాధించింది. అలాగే ఈ చిత్రంతో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆర్ఎక్స్100 సినిమాలో పాయల్ అందచందాల ఆరబోతకు కుర్రకారు క్లీన్ బౌల్డ్ అయ్యారు.

”ఒంటేరు పాలకోవా.. నడకచూస్తే హంస నావా..”

తాజాగా  పాయల్ రాజ్‌పుత్ ఓ ఐటమ్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తేజ దర్శకత్వంలో బెల్లంకొడ శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’లో ఆడిపాడిందామె. పాయల్ నర్తించిన ఈ ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియోను బుధవారం (ఏప్రిల్ 3) రిలీజ్ చేశారు.

”ఒంటేరు పాలకోవా.. నడకచూస్తే హంస నావా..” అంటూ మొదలైన ఈ పాట ‘బుల్లెట్టు మీదొచ్చే బుల్రెడ్డి..’ అంటూ హుషారెత్తిస్తోంది. ఈ సాంగ్‌లో పాయల్ హాట్ హాట్ అందాల సొగసులు ఆరబోసింది.

ఈ ఐటమ్ సాంగ్‌తో థియేటర్లలో యూత్ గోల పెట్టడం ఖాయం అని చెప్పొచ్చు. మొత్తానికి డైరెక్టర్ తేజ ఈ చిత్రంలో కూడా యూత్‌కి కావాల్సినన్ని ఎలిమెంట్స్ పొందుపరిచారని స్పష్టంగా అర్థమవుతోంది.

చదవండి: మోహన్‌బాబుకు బెయిల్ మంజూరు.. డబ్బు చెల్లించేందుకు 30 రోజుల గడువు!