సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బన్నీ సినిమా లేటెస్ట్ అప్డేట్…!

3:20 pm, Mon, 6 May 19
Bunny Latest Movie Updates, Tollywood Latest News, Movie Latest News, Newsxpressonline

హైదరాబాద్: సోషల్ మీడియా వచ్చాక సమాజంలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలకు మరియు సినిమా హీరోలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను లేనిపోని ప్రస్తావిస్తూ వాటిని ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ చేస్తూ అసలు జరగని దాన్ని జరిగినట్టు సృష్టిస్తూ ఇలా అనేక రకాల వార్తలను చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఈ విధంగానే తాజాగా బన్నీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. నా పేరు సూర్య సినిమా దారుణంగా ఫ్లాప్ అయిన తర్వాత ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలైన రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు.

ఇదిలావుండగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చేస్తూనే మరోపక్క సుకుమార్ తో కూడా అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు బన్నీ పై విషప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా సైలెంట్ గా మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది దీంతో ఈ వార్త గమనించిన అల్లు అర్జున్ అభిమానులు అసలు ఈ వార్తల్లో నిజం లేదని త్రివిక్రమ్ తోనే సినిమా ఇంకా మొదలు కాలేదని అలాంటప్పుడు సుకుమార్ తో సినిమా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాకుండా మరోపక్క అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ సినిమా పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రిజల్టు బట్టి తన నెక్స్ట్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. మొత్తం మీద చూసుకుంటే భారీ ఫ్లాప్ తర్వాత ఖచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆలోచనలో బన్నీ ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది.

చదవండి:  సైరా కోసం సాహసాలు చేస్తున్న మెగాస్టార్! టెంక్షన్స్ లో మెగా అభిమానులు!