ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలంటూ.. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీల ప్రార్థన

celebrities-pray-for-sp-babu-speedy-recovery
- Advertisement -

హైదరాబాద్: స్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని, క్షేమంగా తిరిగి రావాలని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. 

కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంచి అక్కడి వైద్యులు వైద్య చికిత్స అందిస్తోన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

ఈనెల 5న కరోనా బారిన పడిన ఎస్పీ బాలు.. గత పది రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాస్త కోలుకున్నట్లుగానే కనిపించినప్పటికీ మళ్లీ రెండ్రోజుల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

దీంతో ఆయన్ని వెంటిలేటైర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని బాలు కుమారుడు చరణ్ శనివారం ఓ ఆడియో సందేశం ద్వారా తెలిపారు.

అయితే విషాదం ఏమిటంటే.. తాజాగా ఆయన సతీమణి సావిత్రి బాలసుబ్రహ్మణ్యం‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఇదిలా ఉండగా మరోవైపు బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులంతా కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా వారు ప్రార్థిస్తున్నారు.

‘ప్రియమైన సోదరుడు ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..’ అని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

‘బాలసుబ్రమణ్యం సార్ గురించి వినడానికి చాలా భయంగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను..’ అంటూ దుల్కర్ సల్మాన్ ట్వీట్‌ చేశారు.

‘అనారోగ్యం నుంచి కోలుకొని మీ డివైన్‌ వాయిస్‌తో మమ్మల్ని ఆశీర్వదించడానికి తిరిగి వస్తారని మాకు తెలుసు. ఎస్పీ బీ కోలుకోవాలని దేవుడిని ప్రార్థించండి..’  అని సంగీత దర్శకుడు‌ దేవి శ్రీ ప్రసాద్‌ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే ఏఆర్‌ రెహమాన్‌, ఇళయ రాజా, చిత్ర, బోనీ కపూర్‌, భారతీరాజా, కొరటాల శివ, విజయ్‌ ఆంటోని, శేఖర్‌ కపూర్‌, ధనుష్‌, యువన్‌ శంకర్‌ రాజా‌ వంటి వారంతా కూడా బాలు కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. 

 

- Advertisement -