విమానంలో సేదదీరుతున్న చై , సామ్! ఫిదా అవుతున్న నెటిజన్లు!

11:55 am, Mon, 8 April 19
akkineni nagacahitanya, samanta

హైదరాబాద్: మూడు రోజుల క్రితం విడుదలైన ‘మజిలీ’ హిట్ టాక్ ను తెచ్చుకోగా, ఆనందంగా ఉన్న స్టార్ కపుల్ నాగచైతన్య, సమంతల తాజా ఫోటో ఒకటి ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తోంది.

ఇండిగోకు చెందిన ఓ విమానంలో వీరిద్దరూ వెళుతున్న వేళ, చైతూ తన ల్యాప్ టాప్ చూసుకుంటూ బిజీగా ఉండగా, సమంత మాత్రం తన భర్త భుజంపై తల పెట్టి నిద్రపోతోంది.

ఆ సమయంలో తీసిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సమంత పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “ఇంతకన్నా మనకేమీ అవసరం లేదు. ఏదీ దీనిని సాటి కాదు” అన్న అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టింది. ఇక దీన్ని నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.

View this post on Instagram

In the end … nothing else matters ❤️❤️❤️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on