‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, చరణ్!?

2:17 pm, Thu, 25 April 19
ntr and charan and maheshbabu

హైదరాబాద్: మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ‘మహర్షి’ సినిమా, వచ్చేనెల 9వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా అంటే మే 1వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా ఇందుకు వేదికగా మారనుంది.

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. ఎన్టీఆర్‌గానీ లేదంటే చరణ్‌గాని ముఖ్య అతిథిగా రావొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అయితే ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కూడా మహేశ్ బాబుకి మంచి స్నేహితులు కావడం వలన, ఇద్దరూ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకుంటున్నారు.

అదే జరిగితే అభిమానులకి అంతకిమించిన పెద్ద పండుగ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి నిన్న విడుదల చేసిన ‘పదరా .. పదరా’ అనే సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.