ప్రభాస్ పెళ్లెప్పుడో చెప్పిన కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి

10:42 am, Fri, 27 December 19

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లిపై పక్కా క్లారిటీ వచ్చేసింది. అతడు ఓ ఇంటివాడు ఎప్పుడు కాబోతున్నాడో కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామలాదేవి చెప్పేశారు. తాజాగా, ప్రభాస్ పెళ్లిపై వస్తున్న పుకార్లపై శ్యామలాదేవి స్పందించారు.

తమది చాలా పెద్ద కుటుంబమని, అందరితో సర్దుకుపోయే గుణం ఉన్న అమ్మాయి తమకు కావాలని చెప్పుకొచ్చారు. అలాంటి గుణగణాలు ఉన్న అమ్మాయి కోసం వెతుకుతుండడం వల్లే ప్రభాస్ పెళ్లి ఆలస్యమవుతోందని తెలిపారు.

ప్రస్తుతం ప్రభాస్ ‘జాన్’ సినిమాకు సైన్ చేశాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.

ఇది పూర్తయ్యాక ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని శ్యామలాదేవి చూచాయగా చెప్పారు. ఈ వార్త బయటకు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.