నిజంగా వినయ విధేయుడే: ఓటమిని ఒప్పుకున్న మెగా పవర్ స్టార్! ‘మీ అందరినీ అలరించే సినిమాతో మళ్ళీ వస్తా’ అంటూ…

6:04 pm, Tue, 5 February 19
ram-charan-teja-

ram-charan-teja-

హైదరాబాద్: ప్రస్తుత రోజుల్లో సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ ఒకప్పటిలా 50 రోజులు, 100 రోజుల పరిస్థితులు లేవు. ఈ రోజుల్లో సినిమాలు కూడా అంతే స్పీడ్‌గా.. అలా వచ్చి ఇలా పోతున్నాయి. అయితే తమ సినిమా అతికొద్ది రోజులు నడిచినా కూడా మా సినిమా సక్సెస్ పార్టీ, మా సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిందంటూ రకరకాలుగా హంగామా చేస్తుంటారు దర్శక నిర్మాతలు.

‘వినయ విధేయ రామ’ విషయంలో..

ఒకవేళ సినిమా ఆశించిన రిజల్ట్ రాబట్టలేక పోయిందంటే మాత్రం అందరూ సైలెంట్ అయిపోతారు. కానీ హీరో రామ్ చరణ్, తాను అందుకు భిన్నం అని చాటుతూ తన ఓటమిని పబ్లిగ్గా అంగీకరించాడు. రామ్ చరణ్ కెరీర్‌లో ‘రంగస్థలం’ సినిమా తర్వాత భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలైంది ‘వినయ విధేయ రామ’ చిత్రం. బోయపాటి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా ఇది.

అయితే విడుదలకు ముందు భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలయ్యాక మాత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచిందనే చెప్పాలి. కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించినప్పటికీ ఆశించిన రిజల్ట్ రాబట్టలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అయితే ఈ ఫలితాన్ని అంగీకరిస్తూ రామ్ చరణ్ ఓ లేఖ విడుదల చేసి ఆశ్చర్యపరిచాడు.

ramcharan press note