హాస్యనటుడు అలీకి మాతృవియోగం.. మెగాస్టార్ నివాళి, పవర్ స్టార్ సానుభూతి…

5:25 pm, Thu, 19 December 19
comedian-ali-s-mother-jaitun-bibi-died

హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు అలీ మాతృవియోగానికి లోనయ్యారు. అలీ తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో కన్నుమూశారు. రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఉంటోన్న ఆమె అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్న ఆలీ.. ఈ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈలోగా జైతున్ బీబీ భౌతికకాయాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్‌‌లోని అలీ నివాసానికి తరలించారు.

comedian-ali-s-mother-died-chiranjeevi-pays-condolencesమెగాస్టార్ చిరంజీవి నివాళి…  

ఇక ఈ వార్త తెలియగానే సినీరంగానికి చెందిన ప్రముఖులు అలీ ఇంటికి చేరుకుని తమ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే అలీ నివాసానికి చేరుకుని జైతున్ బీబీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 

పవర్‌స్టార్ ప్రగాఢ సానుభూతి…

అలాగే జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అలీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.

comedian-ali-s-mother-died-pawan-kalyan-pays-condolences‘‘అలీ మాతృమూర్తి జైతున్ బీబీ తుదిశ్వాస విడిచారనే విషయం తెలిసి చాలా బాధ కలిగింది. బీబీగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తన తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలమైనదో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను..’’ అని ఆ ప్రకటనలో పవన్ పేర్కొన్నారు. 

హాస్యనటుడు అలీ తన తల్లిపై తనకున్న ప్రేమను పలు సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. కొన్నిసార్లు తన తల్లి గురించి ఆయన స్టేజిపైనే గొప్పగా చెప్పేవారు. కాగా అలీ తల్లి అంత్యక్రియలు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

comedian-ali-with-his-mother-jaitun-bibi
ఫైల్‌ఫోటో: టాలీవుడ్ హాస్యనటుడు అలీ తన తల్లి జైతున్ బీబీ ఆశీర్వాదం తీసుకుంటున్న దృశ్యం