కమెడియన్ శ్రీనివాసరెడ్డి కొత్త అవతారం.. ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’

12:19 pm, Sat, 28 September 19

హైదరాబాద్: పాపులర్ కమెడియన్, హీరో శ్రీనివాస రెడ్డి నిర్మాతగా, దర్శకుడిగా కొత్త అవతారమెత్తాడు. ఆకృతి – ఆశృతి సమర్పణలో.. ఏ ఫ్లైయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై.. శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా.. ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’.. ‘మంచి రసగుల్లా లాంటి సినిమా’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ‘నో యాక్షన్, నో సెంటిమెంట్, ఓన్లీ కామెడీ’ అంటూ రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు.

పోస్టర్‌లో శ్రీనివాస రెడ్డితో పాటు సత్య, షకలక శంకర్.. సూటూ బూటూ వేసుకుని దసరా బుల్లోడి గెటప్స్‌లో ఉన్నారు. శ్రీనివాస రెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మూవీకి రైటర్‌గా పనిచేసిన పరమ్ సూర్యాన్షు ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. సాకేత్ కోమండూరి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

త్వరలో ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’.. టీజర్ రిలీజ్ కానుంది. సినిమాటోగ్రఫీ : భరణి కె ధరన్, ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, మ్యూజిక్ : సాకేత్ కోమండూరి, ఆర్ట్ : రఘు కులకర్ణి, లైన్ ప్రొడ్యూసర్ : చిత్రం శ్రీను, నిర్మాత, దర్శకత్వం : శ్రీనివాస రెడ్డి.